ప్రముఖ నిర్మాత దిల్ రాజు పై కేసు నమోదు అయ్యింది. నా మనసు నిన్ను కోరే నవల రచయిత్రి శ్యామలారాణి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఫిర్యాదు చేశారు. మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాకి తన నవలలోని స్టొరీని అనుమతి లేకుండా కాపీ కొట్టారు అంటూ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మాత దిల్ రాజు పై పోలీసులు 120ఏ, 415, 420 కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో ప్రభాస్ హీరోగా కాజల్, తాప్సీ హీరోయిన్లుగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రానికి ధశరథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
Saturday, September 16, 2017
ఎస్వీ రంగారావు పాత్రలో ఈ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'మహానటి'. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోంది. సమంత, దుల్కర్ సల్మాన్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే, ప్రకాష్ రాజ్ వంటి నటులు ముఖ్యపాత్రల్లో మెప్పించబోతున్నారు. ఇప్పుడు ఈ చిత్ర బృందంలో మోహన్ బాబు వచ్చి చేరాడు. విశ్వ నటచక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రలో ఈ కలెక్షన్ కింగ్ కనిపించనున్నారు.సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'మహానటి'. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోంది. సమంత, దుల్కర్ సల్మాన్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే, ప్రకాష్ రాజ్ వంటి నటులు ముఖ్యపాత్రల్లో మెప్పించబోతున్నారు. ఇప్పుడు ఈ చిత్ర బృందంలో మోహన్ బాబు వచ్చి చేరాడు. విశ్వ నటచక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్రలో ఈ కలెక్షన్ కింగ్ కనిపించనున్నారు.
తేజ దర్శకత్వంలొ బాలక్రిష్ణ????
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తాను తలపెట్టిన చిత్రానికి తేజతో దర్శకత్వం చేయించాలని బాలయ్య భావిస్తున్నట్టు సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఈ విషయంలో బాలకృష్ణ, తేజల మధ్య చర్చలు కూడా జరిగాయని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దాదాపుగా ఎన్టీఆర్ బయోపిక్కు తేజ దర్శకుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
Friday, September 15, 2017
Thursday, September 14, 2017
రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ ట్రైలర్ విడుదల
బాలీవుడ్లో అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలు తీయడంలో అందరికంటే ముందుండే ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్, గతంలో తెరకెక్కించిన రాగిణి ఎంఎంఎస్, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి. వీటికి సీక్వెల్గా కాకుండా వెబ్ సిరీస్ రూపంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' పేరిట ట్రైలర్ విడుదలైంది
Subscribe to:
Posts (Atom)