ప్రముఖ నిర్మాత దిల్ రాజు పై కేసు నమోదు అయ్యింది. నా మనసు నిన్ను కోరే నవల రచయిత్రి శ్యామలారాణి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఫిర్యాదు చేశారు. మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాకి తన నవలలోని స్టొరీని అనుమతి లేకుండా కాపీ కొట్టారు అంటూ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మాత దిల్ రాజు పై పోలీసులు 120ఏ, 415, 420 కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో ప్రభాస్ హీరోగా కాజల్, తాప్సీ హీరోయిన్లుగా నటించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చిత్రానికి ధశరథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment